డ్యూటీలోనే విద్యుత్ షాక్‌… ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ప్రాణం కోసం కుటుంబం పోరాటం!

డ్యూటీలోనే విద్యుత్ షాక్‌… ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ప్రాణం కోసం కుటుంబం పోరాటం!

సత్తుపల్లి, అక్టోబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):

విద్యుత్ శాఖ నిర్లక్ష్యం మరోసారి పేద కుటుంబాన్ని దారుణ పరిస్థితుల్లోకి నెట్టింది. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం దిద్దుపూడి గ్రామానికి చెందిన జుంజునూరి వెంకటేశ్వరరావు (32) అనే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి డ్యూటీ సమయంలో విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు.WhatsApp Image 2025-10-22 at 1.13.35 PMWhatsApp Image 2025-10-22 at 1.13.45 PM ప్రస్తుతం ఆయనహైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.

వివరాల్లోకి వెళ్తే — అక్టోబర్ 10న దిద్దుపూడి గ్రామానికి చెందిన భూషణం అనే రైతు పొలంలోని ట్రాన్స్‌ఫార్మర్ విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఫిర్యాదు చేయడంతో, వెంకటేశ్వరరావు కందుకూరు సబ్‌స్టేషన్‌ నుండి లైన్ క్లియరెన్స్‌ (ఎల్‌సీ) తీసుకుని మరమ్మతు పనులు ప్రారంభించాడు. అయితే పనులు కొనసాగుతున్న సమయంలోనే ఎవరైనా విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంతో 11 కెవి తీగలు తగిలి ఆయన నేలకొరిగాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరరావును సహచరులు ఖమ్మం ఆసుపత్రికి తరలించగా, వైద్యుల సూచన మేరకు అనంతరం హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో వెంకటేశ్వరరావు రెండు చేతులు తీవ్రంగా దెబ్బతినడంతో వైద్యులు ఒక చేయిని తొలగించాల్సి వచ్చింది. గుండె సమస్య తలెత్తడంతో హార్ట్ సర్జరీ అవసరమని వైద్యులు తెలిపారు. మొత్తం చికిత్స ఖర్చు సుమారు రూ.27 లక్షల వరకు అవుతుందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

“నా కొడుకు డ్యూటీలో ఉండగానే షాక్ తగిలి ఇలా అయ్యాడు. రెండు చేతులు కాలిపోయాయి, ఒక చేయి తీసేయాల్సి వచ్చింది. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా విద్యుత్ శాఖలో ఒక్క అధికారి ఆసుపత్రికి రాలేదు. నా కొడుకు ప్రాణానికి విలువ లేదా?” అని వెంకటేశ్వరరావు తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు.

వెంకటేశ్వరరావు అన్న జుంజునూరి రఘు, ఆర్మీ సైనికుడు, మాట్లాడుతూ – “నేను దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నా. నా తమ్ముడు కుటుంబాన్ని చూసుకుంటాడు. కానీ ఈ రోజు వాడే ఇలా అవుతాడని ఊహించలేదు. యాజమాన్యం లైన్ క్లియరెన్స్ ఇచ్చి పని చేస్తున్న వ్యక్తిపై విద్యుత్ సరఫరా ఎలా జరిగిందో చెప్పాలి. ఇది ప్రమాదం కాదు, ఉద్దేశ్యపూర్వకంగా చేసిన పని,” అని ఆవేదన వ్యక్తం చేశాడు.

గ్రామ ప్రజలు కూడా విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇంత పెద్ద ప్రమాదం జరిగినా అధికారులు స్పందించకపోవడం మనసు కలిచివేస్తోంది. ప్రభుత్వం ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందించాలి,” అని వారు డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కలిసి మర్లపాడు గ్రామంలో గల వేంసూరు అసిస్టెంట్ ఇంజినీర్ కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించారు.

“ఏడీ, లైన్‌మన్ గంధం వెంకటేశ్వరరావు, ఆపరేటర్ మాధవరెడ్డి – వీరు ఎల్‌సీ సమయంలో ఫోన్ కాంటాక్ట్‌లో ఉన్నారా లేదా? అనే విషయంపై పూర్తి విచారణ జరిపి నిర్లక్ష్యం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి,” అని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

ప్రస్తుతం జుంజునూరి వెంకటేశ్వరరావు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. వైద్య ఖర్చుల భారంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ప్రభుత్వం ముందుకు వచ్చి సాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!