భూగర్భ డ్రైనేజీ పనులకు శ్రీకారం

భూగర్భ డ్రైనేజీ పనులకు శ్రీకారం

నాచారం, అక్టోబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ లోని రాఘవేంద్ర నగర్ కాలనీలో సుమారు రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పనులకు ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్, పార్టీ నాయకులు, కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ప్రజల సమస్యలను గుర్తించి దశలవారీగా పరిష్కరించడం ప్రభుత్వం ప్రధాన లక్ష్యం. రాఘవేంద్ర నగర్‌లో వర్షాకాలంలో నీరు నిల్వ ఉండడం, పాత డ్రైనేజీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వంటి సమస్యలపై కాలనీ ప్రజలు పలుమార్లు వినతులు చేశారు. గురువారం రోజు ఆ సమస్య పరిష్కారానికి ప్రారంభం పెట్టడం ఆనందంగా ఉంది” అని తెలిపారు.అలాగే, ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పారిశుధ్య సదుపాయాలు మెరుగుపర్చే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ మాట్లాడుతూ, “ఈ పనులు పూర్తయ్యాక కాలనీలో మురుగు నీటి సమస్యలు తగ్గి ప్రజలకు మేలు జరుగుతుంది” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ సాయిజెన్ శేఖర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!