అమర వీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం.
పోలీసు దినోత్సవం సందర్బంగా నివాళులు.
సత్తుపల్లి, అక్టోబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):
బి.గంగారం వద్ద ఉన్న 15వ ప్రత్యేక పోలీసు బెటాలియన్‌లో మంగళవారం పోలీసు అమర వీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ శ్రీ ఎన్. పెదబాబు పాల్గొని విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమర వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్మృతిపరేడ్ నిర్వహించి అమర వీరులకు గౌరవ వందనం సమర్పించారు.
ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ దేశం కోసం, సమాజం కోసం ప్రాణాలను అర్పించిన పోలీసు సిబ్బందిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా జరుపుకునే ఈ దినోత్సవం పోలీసు శాఖ గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కొని సమాజ రక్షణకు పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ శ్రీ ఏ. అంజయ్యతో పాటు అధికారులు, కానిస్టేబుళ్లు, హోం గార్డులు పాల్గొని అమర వీరులకు నివాళులు అర్పించారు.


Comments