వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్
పెద్దమందడి,నవంబర్04( తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలంలోని వెలటూర్, చిలుకటోనీ పల్లి, అల్వాల, పెద్దమందడి, మంగంపల్లి,గట్ల ఖానాపూర్ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను మంగళవారం వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ పంటను ప్రభుత్వ నిర్ధారిత మద్దతు ధరకు విక్రయించుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద తూకం, చెల్లింపు ప్రక్రియ పారదర్శకంగా జరగాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి,మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్,మాజీ జెడ్పీటీసీ వెంకటస్వామి,మాజీ వైస్ ఎంపీపీ శాఖ వెంకటయ్య,గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రేమ్ సాగర్, మాజీ అధ్యక్షులు జగదీశ్వర్రెడ్డి
మల్లక్ కృష్ణయ్య, వడ్డే శేఖర్, మల్లికార్జున్, చందు రెడ్డి, తిమ్మా రెడ్డి, ఆంజనేయులు గౌడ్, డీలర్ శ్రీనివాసులు, ఏపిఎం సక్కుర్ నాయక్, అధ్యక్షురాలు నందిని,వడ్డే లక్ష్మి,కావాలి ఇందిరా, దిండు అనిత, లక్ష్మి. గోరిబేగం, ఐకెపి సిబ్బంది మంజుల రైతులు పాల్గొన్నారు.


Comments