బీసీలకు 42% రిజర్వేషన్లను రాజ్యాంగ 9వ షెడ్యూల్‌లో చేర్చాలి
బిసి, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకుల డిమాండ్
పెద్దమందడి,నవంబర్03(తెలంగాణ ముచ్చట్లు):
బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లును రాజ్యాంగ 9వ షెడ్యూల్‌లో చేర్చాలని, అలాగే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని పెద్దమందడి మండల బీసీ–ఎస్‌సీ–ఎస్టీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మండల జేఏసీ నాయకుడు రాయికంటి రాములు యాదవ్ ఆధ్వర్యంలో మండల ఎమ్మార్వో కు వినతిపత్రం సమర్పించారు.
నాయకులు మాట్లాడుతూ.. రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చేలా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే, 42% రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ (సబ్ క్యాటగరైజేషన్) చేయడం ద్వారా అత్యంత వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం ప్రభుత్వం బీసీ సబ్ ప్లాన్ కింద రూ.40,000 కోట్లు కేటాయించి, బీసీ విద్య, ఉపాధి, ఆర్థిక అభివృద్ధికి వినియోగించాలని, హామీలను పూర్తిగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఈశ్వర్ మహారాజ్, రవి యాదవ్, శాంతన్న, ఎలీషా, రాజు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.


Comments