లీడర్స్ స్కూల్ లో సాక్షి అక్షర పోటీ పరీక్షలు నిర్వహణ 

వెల్టూర్  లీడర్స్ స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటేష్

లీడర్స్ స్కూల్ లో సాక్షి అక్షర పోటీ పరీక్షలు నిర్వహణ 

పెద్దమందడి,నవంబర్03(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం వెల్టూర్ లీడర్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో సోమవారం 1వ నుండి 7వ తరగతి విద్యార్థుల కోసం సాక్షి అక్షర పోటీ పరీక్షలు ప్రిన్సిపల్ వెంకటేష్ నేతృత్వంలో నిర్వహించబడ్డాయి. ఈ పోటీ పరీక్షలు నాలుగు దశల్లో జరుగుతాయని ప్రిన్సిపాల్ వెంకటేష్ తెలిపారు. సోమవారం మొదటి దశ పరీక్షలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.

 ప్రిన్సిపాల్ వెంకటేష్ మాట్లాడుతూ.. ఈ పోటీ పరీక్షల ప్రధాన లక్ష్యం విద్యార్థుల అక్షర నైపుణ్యాలను పెంపొందించడం, పదజాలాన్ని విస్తరించడం, ఆంగ్ల ఉచ్చారణ నైపుణ్యాలను మెరుగుపరచడం, అలాగే ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే అని వారు చెప్పారు.

విద్యార్థులు పోటీ పరీక్షల ద్వారా తమ నైపుణ్యాలను పరీక్షించుకోవడం, నూతన పదాలు నేర్చుకోవడం మరియు సాహసంతో మాట్లాడడం వంటి అంశాల్లో అభ్యసిస్తారని. ఈ పోటీ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఒక మంచి అవకాశం అని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, మరియు కరస్పాండెంట్ విష్ణువర్ధన్ సాగర్ పాల్గొన్నారు. విద్యార్థులు మరియు అధ్యాపకులు ఈ పోటీ పరీక్షలను సాకారాత్మకంగా స్వీకరించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .