క్రీడాకారులకు క్రికెట్ కిట్లు,టీషర్టులు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య 

క్రీడాకారులకు క్రికెట్ కిట్లు,టీషర్టులు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య 

వేలేరు,నవంబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం పీచర గ్రామంలో ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలలో భాగంగా స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డా. తాటికొండ రాజయ్య క్రీడాకారులకు క్రికెట్ కిట్లు, టీషర్టులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్నీ పెంపొందిస్తాయని, యువత క్రీడలలో ప్రతిభ చూపి రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాలని సూచించారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, పట్టుదల వంటి విలువలు పెంపొందుతాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ మ్యాక రవీందర్, పోలు తిరుపతి, ఎం.డి. జానీ, మారబోయిన రాజు, దేవరాజుల జంపయ్య, కొలిపాక వెంకటేష్ తదితరులు, క్రికెట్ నిర్వహణ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .