పీడీఎస్‌యూ రాష్ట్ర 23వ మహాసభల లోగో ఆవిష్కరణ

డిసెంబర్ 10, 11, 12 తేదీల్లో జరగనున్న మహాసభలు

పీడీఎస్‌యూ రాష్ట్ర 23వ మహాసభల లోగో ఆవిష్కరణ

-జయప్రదం చేయాలని నాయకుల  పిలుపు

వరంగల్,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు):

రానున్న డిసెంబర్ 10, 11, 12 తేదీల్లో జరగనున్న ప్రజా ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర 23వ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ, గ్రేటర్ వరంగల్ పాత్రికేయ భవనంలో మహాసభల లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షురాలు ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే, ప్రధాన కార్యదర్శి మైసా శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చారిత్రాత్మక పోరాటాల పునాదిగా నిలిచిన వరంగల్ జిల్లాలో విద్యార్థి మహాసభలు జరగడం గర్వకారణమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల విద్య పేదలకు మరింత దూరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన ఏడు దశాబ్దాలు గడిచినా విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు సామాన్యులకు అందకుండా పాలకులు కార్పొరేటు ధోరణులను అనుసరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ కూలిపోతుందన్నది పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల మూసివేతల ద్వారా స్పష్టమైందని వ్యాఖ్యానించారు.

నూతన జాతీయ విద్యా విధానం 2020 ద్వారా విద్యను పూర్తిగా ప్రైవేటు రంగం ఆధీనంలోకి తీసుకెళ్లే కుట్ర కొనసాగుతోందన్నారు. దీంతో పేద విద్యార్థులు అధిక రుసుములు భరించలేక ఉన్నత విద్యకు దూరమవుతున్నారని తెలిపారు. పాఠ్యాంశాల్లో మూఢనమ్మకాలు, మతాధారిత భావజాలం చొప్పించడం ద్వారా విద్యార్థుల ఆలోచనా స్వేచ్ఛను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచి గాంధీ హత్యకారుడు గాడ్సే వివరాలను తొలగించడం చరిత్ర వక్రీకరణలో భాగమని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు సాగిస్తున్నారని, ఆ స్ఫూర్తితో దేశంలోని విద్యార్థి సమాజం ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. జార్జి రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, రంగవల్లి కోలాశంకర్, దుస్సా చేరాలు వంటి అమరవీరుల త్యాగ స్ఫూర్తితో పీడీఎస్‌యూ సంస్థ విద్యార్థి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.

తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా విద్యార్థుల సమస్యలు పరిష్కారం కాలేదని, ఫీజు తిరిగి చెల్లింపులు, విద్యార్థి వేతనాలు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని విమర్శించారు. పాలకులు మారినా విధానాలు మారలేదని, విద్యార్థులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
డిసెంబర్ 10న కళాశాల ప్రాంగణంలో బహిరంగ సభ, 11, 12 తేదీల్లో అభినవ కార్యక్రమాల మందిరంలో జరిగే ప్రతినిధుల సమావేశాలను విజయవంతం చేయాలని విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులను కోరారు.

ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జాతీయ నాయకుడు మహేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోనగిరి మధు, డాక్టర్ రాజేష్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు గుర్రం అజయ్, ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్, నూతన ప్రజాస్వామ్య ఉద్యమం ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్, మాజీ విద్యార్థి నాయకులు బాలరాజు, బండి కోటేశ్వర్, అనిల్ రాజేష్, ప్రకాష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రైవేట్ పాఠశాలలు ఆర్టిఐ పరిధిలోకి రావు  ప్రైవేట్ పాఠశాలలు ఆర్టిఐ పరిధిలోకి రావు 
-హైకోర్టు తీర్పును గుర్తుచేసిన ప్రైవేట్ పాఠశాలల సంఘం ఎల్కతుర్తి,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండల ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు మండల...
ఐకేపీ కేంద్రాల్లో రైతుల కష్టాలు 
సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు 
భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన  
సత్యనారాయణ కాలనీలో కొత్త వైన్‌షాప్‌కి ప్రజల తీవ్ర వ్యతిరేకం
పీడీఎస్‌యూ రాష్ట్ర 23వ మహాసభల లోగో ఆవిష్కరణ
రామారావు హత్యను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం