మర్లపాడు పల్లె దవాఖానలో పారిశుద్ధ్య లోపం.!
- రోగులు, గ్రామస్థులకు ఇబ్బంది.
- పట్టించుకోని అధికారులు.
సత్తుపల్లి, నవంబర్ 4 (తెలంగాణ ముచ్చట్లు) :
వేంసూరు మండలం, మర్లపాడు గ్రామంలోని పల్లె దవాఖాన–ఆయుష్మాన్ ఆరోగ్యమందిరం పరిసరాలలో పారిశుద్ధ్య లోపం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. హాస్పిటల్ చుట్టుపక్కల చెత్త పేరుకుపోవడం, మురుగు నీరు నిల్వ ఉండటం, దుర్వాసన వాసన వ్యాపించడంతో రోగులు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రహదారి నుండి హాస్పిటల్ లోపలికి వెళ్లే మార్గం కూడా ఇబ్బందికరంగా మారింది. నిల్వ నీరు, చెత్తతో నిండిపోవడంతో రోగులు, గర్భిణీలు, వృద్ధులు నడవడం కూడా కష్టమవుతోంది. అత్యవసరంగా చికిత్స కోసం వచ్చేవారికి ఇది మరింతసమస్యగా మారిందని ప్రజలు అంటున్నారు.
ఇక శానిటేషన్ కార్మికులు సమయానికి శుభ్రత పనులు చేపట్టకపోవడం, పంచాయతీ మరియు ఆరోగ్య శాఖ అధికారులు పర్యవేక్షణ లేకపోవడం కారణమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పల్లె దవాఖాన ప్రధానంగా గ్రామీణ ప్రజలకు శుభ్రమైన మరియు అందుబాటు వైద్యసేవలు అందించాలన్న ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు ఆ లక్ష్యాన్ని అసలు సాధించనివ్వడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తక్షణమే పరిశుభ్రత చర్యలు తీసుకోవాలని
దవాఖాన పరిసరాలను శుభ్రపరచడం, మురికినీటి
కాల్వల సమస్య పరిష్కరించడం, నిత్య శానిటేషన్ పర్యవేక్షణ చేపట్టాలని ప్రజలు పంచాయతీ కార్యదర్శి, ఆరోగ్య శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.


Comments