చర్లపల్లి పుకట్ నగర్‌లో సిసి రోడ్డు పనుల పరిశీలన
నేమూరీ మహేష్ గౌడ్
చర్లపల్లి, నవంబర్ 03 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు చర్లపల్లి డివిజన్ పరిధిలోని పుకట్ నగర్‌లో జరుగుతున్న సిసి రోడ్డు పనులను బిఆర్ఎస్ పార్టీ నాయకుడు నేమూరీ మహేష్ గౌడ్ శుక్రవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చర్లపల్లి డివిజన్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్ని విధాలా కృషి చేస్తున్నారు. ప్రజలకు మెరుగైన రోడ్లు, కాలువలతో పాటు మౌలిక వసతుల అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుని ముందుకు సాగుతున్నారు అని తెలిపారు. ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గాలమ్మ, యాదయ్య, బస్వయ్య, ఆనంద్ రాజు, గణేష్, నర్సింహా, రమేశ్, రాజు, బాల్‌రాజు, కోటేశ్, రవి, అనిల్ కుమార్, రెడ్డి నాయక్, వినయ్, శేఖర్, రామ్, సురేష్, శ్రీనివాస్ నాయక్, లోకనాథ్, రాజశేఖర్, మధు, రఘు, హరీష్, నాగరాజు, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.


Comments