దేశవ్యాప్తంగా 116 గురు ఉపాధ్యాయులకు “జాతీయ ఉపాధ్యాయ అవార్డు–2025”
డాక్టర్ రాధాకృష్ణన్ టీచర్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఆధ్వర్యంలో ఘన సత్కారం
సికింద్రాబాద్, నవంబర్ 4 (తెలంగాణ ముచ్చట్లు):
విద్యారంగంలో విశిష్ట సేవలు అందించిన ఉపాధ్యాయులను గౌరవించేందుకు డాక్టర్ రాధాకృష్ణన్ టీచర్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నేషనల్ ఎడ్యుకేటర్స్ అవార్డ్స్ – 2025’ కార్యక్రమం సికింద్రాబాద్‌లోని కేంద్ర హిందీ శిక్షణ సంస్థలో భవ్యంగా జరిగింది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3.40 గంటల వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 116 మంది ఉపాధ్యాయులకు పురస్కారాలు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా డా. రాధాకృష్ణన్ టీచర్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అధ్యక్షులు డా. అజిత్ కుమార్ చౌహాన్ మాట్లాడుతూ, “ఉపాధ్యాయుల అంకితభావం, విద్యారంగంలో వారు సృష్టిస్తున్న కొత్త ప్రమాణాలను గుర్తించి ఈ అవార్డులు అందిస్తున్నాం. ఉపాధ్యాయుల సేవలు భవిష్యత్ తరాలను నిర్మించే శక్తి” అని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ బబితాచక్కిలంను, రాష్ట్ర కోఆర్డినేటర్లను కూడా సన్మానించారు.ఆర్‌కేటీఎస్‌హెచ్‌జీ డైరెక్టర్ భోలా సింగ్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల అనుభవాలు, ఆవిష్కరణలను పంచుకోవడానికి ఈ వేదిక సహాయపడుతుందని తెలిపారు. ‘ఉపాధ్యాయుల ఐక్యత – భవిష్యత్తు బలంగా’ అనే లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతోందని చెప్పారు.కార్యక్రమానికి విద్యావేత్త డా. సురభి దత్ ప్రధాన అతిథిగా, డా. రాజీవ్ సింగ్ ప్రత్యేక అతిథిగా హాజరై పురస్కార గ్రహీతలను అభినందించారు.కార్యక్రమంలో ట్రెజరర్ ప్రమోద్ పాల్, ప్రోగ్రామ్ మేనేజర్ సంతోష్ మానే, జాతీయ ప్రతినిధి డా. ఇంద్రజీత్ సింగ్, పి.ఆర్.ఓ ధనంజయ్ సింగ్ కుశ్వాహా, సలహాదారు గంగా పచౌరీ తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమాన్ని గీతాంజలి వశిష్ట సమన్వయం చేయగా, నిర్వహణ బాధ్యతలను స్టేట్ కోఆర్డినేటర్ డా. బసంతి నిర్వర్తించారు. సంస్థ తరఫున ఉపాధ్యాయులు అధికారిక వెబ్‌సైట్ www.rktshgindia.orgలో ఉచిత రిజిస్ట్రేషన్ చేసుకుని జాతీయ ఉపాధ్యాయ సమూహంలో సభ్యులవ్వాలని పిలుపునిచ్చారు


Comments