వేలేరు పిహెచ్‌సీ లో సమస్యల పర్వం,పట్టించుకోని అధికారులు!
వేలేరు,నవంబర్03(తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్‌సీ)లో పలు సమస్యలు నెలకొని ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వైద్యసేవలు అందించే సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండడం, పరికరాలు సరిగా పనిచేయకపోవడం, పరిశుభ్రత లోపించడం వలన రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
.jpeg)
.jpeg)
సిబ్బంది విధుల వివరాలు బోర్డుపై పొందుపరచకపోవడం, సమాచారం కోసం అడిగినపుడు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు లేకపోవడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, పురుషుల కోసం వేర్వేరు సూచిక బోర్డులు లేకపోవడం కూడా అసౌకర్యానికి కారణమవుతోంది.
అదనంగా, వాక్సిన్ నిల్వ ఉంచే రిఫ్రిజిరేటర్ చెడిపోయి మరమ్మతులో ఉందని వైద్య సిబ్బంది తెలిపారు. అయితే రక్త, మూత్ర, కిడ్నీ, లివర్ పరీక్షల కోసం అవసరమైన పరికరాలు, అంబులెన్స్ సౌకర్యం అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.ప్రజలు ఆరోగ్య కేంద్రం పూర్తిస్థాయిలో పనిచేసేలా పరిశుభ్రత, పారదర్శకతతో కూడిన సేవలు అందించేందుకు అధికారుల దృష్టి సారించాలని, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Comments