సూరారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గృహప్రవేశం

ముఖ్య అతిథిగా మండల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పొన్నం ఇన్అనూప్ గౌడ్ 

సూరారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గృహప్రవేశం

ఎల్కతుర్తి. నవంబర్03 (తెలంగాణ ముచ్చట్లు) 

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మంజూరైన గృహాల్లో గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పొన్నం అనూప్ గౌడ్ హాజరై లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశం నిర్వహించారు.
ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారురాలు సింగవేన మానస మాట్లాడుతూ, “ఇందిరమ్మ ఇల్లు రావడం ఎంతో సంతోషంగా ఉంది. నా సొంత ఇంటి కల నెరవేరింది. ఈ సంతోషాన్ని ఇచ్చిన రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ నాయకులు మరియు గ్రామ నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు.

WhatsApp Image 2025-11-03 at 8.37.27 PM (1)ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుకినే సంతాజీ, సూరారం గ్రామ శాఖ అధ్యక్షుడు బచ్చు శ్రీధర్ రావు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంబాల శ్రీకాంత్, యూత్ కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా మాజీ జనరల్ సెక్రటరీ మండ సుమన్ గౌడ్, మార్కెట్ డైరెక్టర్ బచ్చు బాపురావు, దాట్ల ప్రవీణ్, మొలుగురి భాస్కర్, కుర్ర చంద్ర ప్రకాష్, పోలాటి తిరుమల్ రావు, భాష బోయిన సంతోష్, ఉట్కూరి ప్రణీత్ గౌడ్, పెంకచికల్ పేట్, గ్రామ శాఖ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్, జగన్నాధపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు ముష్కే శ్రీనివాస్, శేఖర్ గౌడ్, రఘురాం గౌడ్, రాంభూపాల్ రెడ్డి, చల్లూరి వేణు, ఇరువాల సాంబయ్య, పుల్లింటి సంపత్, గడలా అజయ్ తదితర గ్రామస్థులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .