సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు 

కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్

సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు 

చిలుకనగర్, నవంబర్ 04 (తెలంగాణ ముచ్చట్లు)

చిలుకనగర్ డివిజన్ బీరప్పగడ్డ ప్రాంతంలో రూ.23 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యులు బన్నాల గీతాప్రవీణ ముదిరాజ్ సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు.WhatsApp Image 2025-11-04 at 9.00.17 PM ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “ప్రజలు సౌకర్యవంతంగాప్రయాణించేందుకు డివిజన్‌లో దశలవారీగా సీసీ రోడ్డు పనులు చేపట్టాం. ఇప్పటివరకు 85 శాతం పనులు పూర్తి అయ్యాయి. మిగిలిన పనులను సీవరేజ్ పైప్‌లైన్ పనులు ముగిసిన వెంటనే పూర్తిడి చేస్తాం” అన్నారు.నాణ్యతపై ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేసిన గీతా ప్రవీణ, “సీసీ రోడ్ పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి. నిబంధనలు ఉల్లంఘించిన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడం” లేదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డి.ఇ వెన్నెల్ గౌడ్, ఏ.ఇ రాధిక, వర్క్ ఇన్స్పెక్టర్ కేదార్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, నాయకులు ఎద్దుల కొండల రెడ్డి, కొకొండ జగన్, మార్కా శీను, గణేష్, ఇంద్రసేనారెడ్డి, సత్యనారాయణ, శ్యామ్, బంటి, స్థానిక బస్తీవాసులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .