సత్యనారాయణ కాలనీలో కొత్త వైన్‌షాప్‌కి ప్రజల తీవ్ర వ్యతిరేకం

మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్ కొకుట్ల చంద్రారెడ్డి ఫిర్యాదు

సత్యనారాయణ కాలనీలో కొత్త వైన్‌షాప్‌కి ప్రజల తీవ్ర వ్యతిరేకం

నాగారం, నవంబర్ , నవంబర్ 4 (తెలంగాణ ముచ్చట్లు)

నాగారం మున్సిపాలిటీ పరిధిలోని సత్యనారాయణ కాలనీ వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న వైన్‌షాప్‌పై స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై నాగారం మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్ కొకుట్ల చంద్రారెడ్డి  తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్‌కు ఫిర్యాదు సమర్పించారు.
సుమారు 400 కుటుంబాలు నివసిస్తున్న ఈ కాలనీ పక్కనే కృష్ణవేణి టాలెంట్ స్కూల్, క్రాంతి చిల్డ్రన్స్ హాస్పిటల్, బస్టాండ్, శుక్రవారం మార్కెట్ వంటి ముఖ్యమైన ప్రజా ప్రాంతాలు ఉండగా, ప్రజలు, ముఖ్యంగా మహిళలు మరియు విద్యార్థులు ప్రయాణించే ప్రధాన రహదారిపై వైన్ షాప్ ఏర్పాటు చేయడం ప్రజల భద్రతకు ముప్పుగా మారుతుందని ఆయన తెలిపారు.అంతే కాకుండా నందమూరి తారకారామారావు , దొడ్డి కొమరయ్య  విగ్రహాలు ఉన్న గౌరవనీయమైన స్థలానికి సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడం సముచితం కాదని పేర్కొన్నారు. ఇప్పటికే మున్సిపాలిటీ మరియు మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణం జరుగుతుండటంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రతిపాదిత వైన్‌షాప్‌ను వెంటనే రద్దు చేసి స్థానిక ప్రజలకు న్యాయం చేయాలని ఎక్సైజ్ శాఖను చంద్రారెడ్డి  కోరారు. స్థానిక కాలనీలవాసులు కూడా ఈ కదలికకు మద్దతు తెలుపుతూ త్వరితగతిన స్పందించాలని అధికారులను కోరుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .