తల్లిని కడతేర్చిన.. తనయుడు
నిందితుడిని అరెస్టు చేసిన ఎస్సై కూచిపూడి జగదీష్.
ఖమ్మం బ్యూరో , నవంబర్ 3,తెలంగాణ ముచ్చట్లు:
చివరి గడియల్లో తల్లికి అండగా ఉంటాడనుకున్న కొడుకు కాలయముడయ్యాడు.నవ మాసాలు మోసిన తల్లిని మద్యానికి బానిసై కన్న పెగే కాటికి చేర్చిన విషాదం తిరుమలాయపాలెం మండలంలో చోటుచేసుకుంది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కాకరవాయి గ్రామానికి చెందిన మందుల బూబ (50)అనే మహిళ కొడుకు మధు చేతిలో హతమైంది. బూబ భర్త గతంలోనే చనిపోయాడు.
కొడుకు మధు కు వివాహంచేయగా, ఇద్దరు కొడుకులు జన్మించిన తరువాత భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదాల్లో, రెండు సంవత్సరాల క్రితం మధు భార్య ఇద్దరు కొడుకులను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ క్రమంలో మద్యానికి బానిసైన మందుల మధు తన తల్లిని మద్యం కొరకు పెన్షన్ డబ్బులు ఇవ్వమని అడగగా ఆమె నిరాకరించడంతో ఆదివారం రాత్రి గొడ్డలితో కొట్టి హత మార్చడని మృతురాలి తమ్ముడు నల్లగట్టు కాశయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు మందుల మదు పై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి నిందితుడు మందుల మధుని అరెస్టు చేయడమైనదని ఎస్సై కూచిపూడి జగదీష్ తెలిపారు.


Comments