ఆరోగ్యంగా సంతోషంగా జీవించడానికి ఐదు సూత్రాలు
అవగాహన సదస్సులో డాక్టర్ కె.వి కృష్ణారావు
ఖమ్మం బ్యూరో, నవంబర్ 3, తెలంగాణ ముచ్చట్లు;
పుట్టకోట ప్రాథమిక హై స్కూల్ లో న్యూ లక్ష్య ఎన్జీవో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్యంగా , సంతోషంగా జీవించడానికి ఐదు సూత్రాలు అనే అంశంతో నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా పిల్లల డాక్టర్ కె.వి కృష్ణారావు పాల్గొని మాట్లాడారు . ప్రస్తుతం ఉన్న జనరేషన్లో పిల్లలు ఎక్కువగా మొబైల్ ఫోను వాడుతున్నారని అన్నారు .
దీనిని తగ్గించడానికి తల్లిదండ్రులు తగు చర్యలు చేపట్టాలని అలాగే ఆహారం అలవాట్లలో మార్పుతీసుకుని రావాలని సమతుల్య ఆహారం కూరగాయలు , పండ్లు తో పాటు సరైన నిద్ర , పరిశుభ్రత , వ్యాయామం , వినోదం అందించాలని సూచించారు . వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం అని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో న్యూ లక్ష్య ఎన్జీవో ఫౌండేషన్ ఫౌండర్ గరిడేపల్లి సత్యనారాయణ , ఎస్ జ్యోతి హెడ్మిస్ట్రెస్ , సుజాత బయాలజీ టీచర్ , పద్మావతి సైన్స్ టీచర్ , నాగలక్ష్మి ప్రైమరీ స్కూల్ టీచర్ మరియు విద్యార్థులు , స్టాప్ తదితరులు పాల్గొన్నారు .


Comments