మల్లవరం గ్రామంలో మహా పడిపూజ కార్యక్రమం..
Views: 8
On
ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 23, తెలంగాణ ముచ్చట్లు:
తల్లాడ మండలంలోని మల్లవరం గ్రామంలో మాజీ ఉపసర్పంచ్ ఎర్రి నరసింహారావు స్వామి ఆధ్వర్యంలో గురువారం మహా పడిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు హాజరై పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయ్యప్ప పడిపూజ లో భాగంగా గేయాలను పాడి ప్రత్యేక పూజలు చేశారు. 40 రోజులు పాటు అయ్యప్ప స్వాములు ప్రత్యేక ఉపవాసం ఉండి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో గురు స్వాములు దాసరి వెంకటేశ్వరరావు, ఎర్రి రాఘవరావు, బెల్లంకొండ శ్రీనివాసరావు, దుగ్గిదేవర తిరుపతిరావు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments