ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన జీ.ఎం చింతల.శ్రీనివాస్.

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన జీ.ఎం చింతల.శ్రీనివాస్.

సత్తుపల్లి, నవంబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి సింగరేణి ఏరియాకు కొత్తగా నియమితులైన జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ సోమవారం స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జి.ఎం. శ్రీనివాస్ ఎమ్మెల్యే ని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు.

తాజాగా ఏర్పాటు చేసిన సత్తుపల్లి సింగరేణి ఏరియాకు తమ సహకారం అందించాలని ఆయన అభ్యర్థించారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ, సింగరేణి అభివృద్ధి, స్థానిక ప్రజల సంక్షేమం కోసం తాము ఎల్లప్పుడూ ముందుంటామని హామీ ఇచ్చారు.

అదే సమయంలో సింగరేణి ప్రభావిత గ్రామాల ప్రజలకు సంస్థ సహాయ సహకారాలు అందించడంతో పాటు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని ఆమె జి.ఎం. శ్రీనివాస్‌కి సూచించారు.

ఈ కార్యక్రమంలో జే.వి.ఆర్ ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రహ్లాద, డి.వై.ఎస్.ఎస్.సి రవికుమార్, సంక్షేమ అధికారి దేవదాసు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .