జెడ్‌పీ బాలికల పాఠశాల విద్యార్థినుల గెలుపు జెండా.

రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు ముగ్గురు విద్యార్థినుల ఎంపిక.

జెడ్‌పీ బాలికల పాఠశాల విద్యార్థినుల గెలుపు జెండా.

సత్తుపల్లి, నవంబర్‌ 3 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు క్రీడా రంగంలో తమ ప్రతిభను మరోసారి నిరూపించారు. ఆదివారం అదే పాఠశాలలో జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా అండర్‌–14 కరాటే ఎంపిక పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి ముగ్గురు విద్యార్థినులు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు.

ఈ పోటీల్లో ఎస్‌.డి. ఆఫ్రిన్‌, ఎం. పావని, ఎం. ప్రహర్షిక తమ చురుకుదనం, పట్టుదలతో ఆకట్టుకుని పాఠశాల పేరు మరింత ఎత్తుకు చేర్చారు. ఈ విజయం పాఠశాలకు మాత్రమే కాకుండా మొత్తం సత్తుపల్లి ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది.

వారి విజయంపై ప్రధానోపాధ్యాయుడు ఎన్‌. నాగేశ్వరరావు, వ్యాయామ ఉపాధ్యాయురాలు (పిడి) చీకటి శ్రీదేవి హర్షం వ్యక్తం చేశారు. వీరు రాష్ట్ర స్థాయిలోనూ బాగా ప్రదర్శించి జాతీయ స్థాయికి వెళ్లాలని మా ఆశయం అని చెప్పారు.

ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ, విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో వ్యాయామ ఉపాధ్యాయుల (పిడి) పాత్ర చాలా ముఖ్యమైనది. వారి శిక్షణ, మార్గదర్శకత, ప్రోత్సాహం వల్లే ఈ విజయాలు సాధ్యమవుతున్నాయి అని అన్నారు.

ఈ విజయంతో అయ్యగారిపేట జెడ్‌పీ బాలికల పాఠశాల పేరు మళ్లీ వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు, విద్యా వర్గాలు విద్యార్థినుల విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రైవేట్ పాఠశాలలు ఆర్టిఐ పరిధిలోకి రావు  ప్రైవేట్ పాఠశాలలు ఆర్టిఐ పరిధిలోకి రావు 
-హైకోర్టు తీర్పును గుర్తుచేసిన ప్రైవేట్ పాఠశాలల సంఘం ఎల్కతుర్తి,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండల ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు మండల...
ఐకేపీ కేంద్రాల్లో రైతుల కష్టాలు 
సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు 
భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన  
సత్యనారాయణ కాలనీలో కొత్త వైన్‌షాప్‌కి ప్రజల తీవ్ర వ్యతిరేకం
పీడీఎస్‌యూ రాష్ట్ర 23వ మహాసభల లోగో ఆవిష్కరణ
రామారావు హత్యను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం