తెలంగాణ ముచ్చట్లు కథనానికి స్పందించిన అధికారులు
Views: 13
On
వేలేరు,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు):
ఇటీవల తుఫాన్ ప్రభావంతో వేలేరు మండలకేంద్రంలో ఏర్పడిన భారీ వరదల కారణంగా ఎల్లమ్మగుడి వాగు వద్ద మిషన్ భగీరథ పైపులైన్ పూర్తిగా దెబ్బతిన్నది. ఈ అంశంపై “తెలంగాణ ముచ్చట్లు”లో ప్రచురితమైన వార్తకు అధికారులు వెంటనే స్పందించారు.
సంబంధిత శాఖ సిబ్బంది తక్షణమే పైపులైన్‌ను మరమ్మతు చేసి, మండలకేంద్రంలో తాగునీటి సరఫరా తిరిగి సజావుగా కొనసాగేలా చర్యలు చేపట్టారు. ప్రజలు తాగునీటి సమస్యలు ఎదుర్కోకుండా వేగంగా చర్యలు తీసుకున్న అధికారులకు, సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన “తెలంగాణ ముచ్చట్లు” యాజమాన్యానికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments