భారత క్రికెట్ మహిళా జట్టు చరిత్ర రాసింది ఉప్పల్‌లో సంబరాలు
ఉప్పల్, నవంబర్ 03 (తెలంగాణ ముచ్చట్లు):
భారత మహిళా క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించి వరల్డ్ కప్‌ను కైవసం చేసుకున్న సందర్భంగా ఉప్పల్‌లో ఆనందోత్సవాలు నిర్వహించారు. గజ్జెల సత్యరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో అభిమానులు బాణాసంచా పేల్చి, మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా సత్యరాజ్ గౌడ్ మాట్లాడుతూ, “భారత మహిళా క్రికెట్ జట్టు సాధించిన ఈ విజయం 47 ఏళ్ల దేశ ప్రజల చిరకాల స్వప్నానికి నెరవేర్పు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చిన ఈ విజయం దేశ గర్వాన్ని పెంచింది,” అన్నారు. ఫైనల్ మ్యాచ్‌లో శాఫాలి వర్మ, దీప్తి శర్మ ఉజ్వల ప్రదర్శనతో జట్టు విజయపథంలో నడిపారని కొనియాడారు.విజయోత్సవాల సందర్భంగా తాళాలు మోగిస్తూ, కేక్ కట్ చేసి, జాతీయ జెండాలు ఊపుతూ ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రఘురాం, వేముల తిరుపతి రెడ్డి, అన్య బాలకృష్ణ, జాజుల నాగేష్ గౌడ్, శ్రీనివాస్ చారి, శ్రీహరి గౌడ్, సాయి, అల్వాల్ నాగరాజు, పొట్లూరి లక్ష్మణ్, వెంకటేష్ పటేల్, శ్రీనివాస్ గౌడ్, మోహన్ రెడ్డి, బిక్షం రెడ్డి, రవీందర్ రెడ్డి, కొనని అంజిరెడ్డి, జగన్, అశోక్, నవీన్, కంకణాల యదగిరి గిరి, జంగారెడ్డి, నాగేష్ గౌడ్, కొత్తగట్టు శ్రీనివాస్ చారి, కృష్ణ, వినోద్, జితేంద్ర, ఉషారాణి, సుభాషిణి, రమ్య తదితరులు పాల్గొన్నారు.


Comments