మీనాక్షి నటరాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లెల ఆదిత్య రెడ్డి
Views: 3
On
వనపర్,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ ను ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో వృత్తిపరుల కాంగ్రెస్ విభాగాన్ని బలపరచడం, యువ వృత్తిపరుల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, సామాజిక , రాజకీయ అవగాహన కార్యక్రమాలను విస్తరించడం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సంస్థ విస్తరణకు తీసుకోవలసిన చర్యలపై విస్తృతంగా చర్చ జరిగింది.
శ్రీమతి మీనాక్షి నటరాజన్ విలువైన సూచనలు, మార్గదర్శకాలు అందించారు. ప్రజలతో నేరుగా మేళవించే కార్యక్రమాలు చేపట్టాలని, ప్రతి జిల్లా స్థాయిలో చురుకైన నాయకత్వాన్ని అభివృద్ధి చేయాలని ఆమె సూచించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
04 Nov 2025 22:04:22
-హైకోర్టు తీర్పును గుర్తుచేసిన ప్రైవేట్ పాఠశాలల సంఘం
ఎల్కతుర్తి,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండల ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు మండల...


Comments