9న ఉమ్మడి మహబూబ్నగర్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఆత్మీయ సభ

జిల్లా అధ్యక్షులు భరత్, ప్రధాన కార్యదర్శి గుంటి వినోద్ సాగర్

9న ఉమ్మడి మహబూబ్నగర్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఆత్మీయ సభ

వనపర్తి,నవంబర్03(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ సమావేశం వనపర్తి పాలిటెక్నికల్ కాలేజీ ఆవరణలో జిల్లా అధ్యక్షులు భరత్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటి వినోద్ సాగర్ అధ్యక్షతన విజయవంతంగా జరిగింది.

సభలో నవంబర్ 9న, ఆదివారం ఉదయం 10 గంటలకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఆత్మీయ సభ నిర్వహించబడనుందని తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి. చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్  కోదండరాం హాజరవుతున్నట్టు తెలిపారు.

సభలో ప్రధానంగా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్ ఏర్పాటును, సమాన పనికి సమాన వేతనం, అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ రద్దు చేయడం, మరియు ఉద్యోగ భద్రత కల్పించడం వంటి డిమాండ్లపై చర్చలు నిర్వహించబడ్డాయి.

జేఏసీ సభ్యులు, ధర్మ, రఘు తదితరులు పాల్గొని, వనపర్తి జిల్లాలోని ప్రతి అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి ఈ సభకు హాజరై ఐక్యతను మరియు బలాన్ని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు.ప్రతీ ఉద్యోగి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా నాయకులు కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .