జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ఉద్యమం ఉధృతం.

కేటాయించిన స్థలాలను వెంటనే క్రమబద్ధీకరించాలి – బీసీ జేఏసీ.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ఉద్యమం ఉధృతం.

హుజురాబాద్, ఆగస్టు 12(తెలంగాణ ముచ్చట్లు ):

హుజురాబాద్ కేసీ క్యాంపులో జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను వారికే క్రమబద్ధీకరించి ఇవ్వాలని బీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు కాయిత రాములు, ప్రధాన కార్యదర్శి కామినేని రవీందర్ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాకు బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షుడు సందేల వెంకన్న, ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్, కొల్లిపాక క్రాంతికుమార్ హాజరై జర్నలిస్టులకు మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో హుజురాబాద్ జర్నలిస్టులకు కేసీ క్యాంపులోని ప్రభుత్వ భూమిలో ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని తెలిపారు. అయితే కేటాయింపులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నాయకుడు గూడూరు స్వామిరెడ్డి కోర్టును ఆశ్రయించడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని సంబంధిత కేసును ఉపసంహరించుకునేలా చర్యలు చేపట్టాలని, జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలను వెంటనే క్రమబద్ధీకరించి వారికి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు.
జర్నలిస్టులు తమ ఇళ్ల స్థలాల కోసం చేపట్టే ఉద్యమానికి బీసీ జేఏసీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని నాయకులు స్పష్టం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.IMG-20260812-WA0036

Tags:

Post Your Comments

Comments

Latest News