శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కాలనీ ఫేస్-1లో ఘనంగా బోనాల సంబరాలు.
జవహర్‌నగర్, ఆగస్టు 10 ( తెలంగాణ ముచ్చట్లు):
జవహర్‌నగర్ చంద్రపురి కాలనీ డివిజన్-2 పరిధిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కాలనీ ఫేస్-1లో ఆషాఢ మాస బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కాలనీ ఫేస్-1 వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు.
వేడుకల్లో భాగంగా కాలనీ మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో తలపై బోనాలతో డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల నడుమ ఊరేగింపుగా తరలివచ్చారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కాలనీ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమానికి కాలనీ వ్యవస్థాపకుడు మంద లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు బుడిద వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.సి. శ్రీకాంత్ మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆషాఢ మాస బోనాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగ అని తెలిపారు. ఇలాంటి పండుగలను సామూహికంగా నిర్వహించుకోవడం ద్వారా కాలనీవాసుల మధ్య ఐక్యత, సోదరభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు ఎం. లక్ష్మీనారాయణ, జనరల్ సెక్రెటరీ కుమ్మరి కృష్ణ, కోశాధికారి కత్తర్ల కిరణ్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్లు మూకర రవి, రంగుల హరికృష్ణ, ఉపాధ్యక్షుడు రంగుల శంకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కోటగిరి సంతోష్ కుమార్, కార్యదర్శులు గరడ్ మహిపత్రావు దత్త, చిక్క రఘు, కెమ్మసరం నగేష్, సహాయ కార్యదర్శులు కెమ్మసరం సుజాత, టి. సుజాత, సుమతి, గౌరవ సలహాదారులు సిల్వేరి శ్రీకాంత్, కెమ్మసరం చంద్రయ్య, పండుగ సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే కార్యవర్గ సభ్యులు సి.హెచ్. బస్వరాజు, ఎం. వంశీ, వై. మహేందర్, చట్టు చిరంజీవి, తన్నీరు నాగరాజు, కుంచాల నవీన్ కుమార్, మిత్రా గౌతమ్, ఏ. నాగచారి, ఆర్. చిత్తారి తదితరులు పాల్గొని బోనాల వేడుకలను విజయవంతం చేశారు.
భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ బోనాల వేడుకలు కాలనీలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పాయి.


Comments