కాంగ్రెస్ సీనియర్ నేత సొల్లు బాబు జన్మదిన వేడుకలు.

ఆత్మీయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

కాంగ్రెస్ సీనియర్ నేత సొల్లు బాబు జన్మదిన వేడుకలు.

హుజురాబాద్, ఆగస్టు 6 (తెలంగాణ ముచ్చట్లు):

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సొల్లు బాబు గారి జన్మదిన వేడుకలు హుజురాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాబు గారి నివాసానికి చేరుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సొల్లు బాబు కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండే వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొన్నారు. బాబు గారు మరిన్ని సంవత్సరాలు ప్రజలకు సేవ చేసే అవకాశం కలగాలని, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
జన్మదిన వేడుకల సందర్భంగా సొల్లు బాబు గారు తనకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయత తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మోర్తాల సాంబయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పానుగంటి కిరణ్ రెడ్డి, జూపాక సమ్మక్క సారలమ్మ జాతర చైర్మన్ దాసరి సదయ్య, బీసీ సెల్ మాజీ నియోజకవర్గ చైర్మన్ కుర్ర శ్రీనివాస్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గంట కొమురయ్య, కందుగుల గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉట్ల రత్నాకర్ రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తెలంగాణ భావజాలానికి చిరునామా జయశంకర్ సార్: మొలుగు ప్రశాంత్ కుమార్. తెలంగాణ భావజాలానికి చిరునామా జయశంకర్ సార్: మొలుగు ప్రశాంత్ కుమార్.
జమ్మికుంట టౌన్, ఆగస్టు 06 (తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సిద్ధాంతపరమైన పునాది వేసి, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నంతా అంకితం చేసిన...
హుజురాబాద్ అభివృద్ధిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సమీక్ష.
ప్రతి గడపకు సంక్షేమం చేరవేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: వొడితల ప్రణవ్.
వివేకానంద విగ్రహం తొలగింపు అవసరం లేదు: హైకోర్టు.
రోడ్డు ప్రమాద బాధిత చిన్నారికి అండగా సబ్బాని వెంకట్.
కాంగ్రెస్ సీనియర్ నేత సొల్లు బాబు జన్మదిన వేడుకలు.
ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. బీఆర్ఎస్‌కు పెరుగుతున్న ఆదరణ: కౌశిక్ రెడ్డి.