కాకర్లపల్లి పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి.
మువ్వా విజయ్‌బాబుకు సీపీఎం వినతి.
Views: 102
On
సత్తుపల్లి, ఆగస్టు 3 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి మండలంలోని కాకర్లపల్లి గ్రామంలో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు నివాస స్థలాలు కేటాయించాలని సీపీఎం నాయకులు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ చైర్మన్ మువ్వా విజయ్‌బాబును కోరారు. సోమవారం సత్తుపల్లి పర్యటనకు వచ్చిన మువ్వా విజయ్‌బాబును సీపీఎం మండల కార్యదర్శి జాజిరి జ్యోతి నేతృత్వంలోని బృందం కలిసి వినతిపత్రం అందజేసింది. కాకర్లపల్లి గ్రామంలోని నిరుపయోగంగా ఉన్న బేతుపల్లి చెరువు నుంచి వాటర్ వెల్ వరకు ఉన్న ఎన్టీఆర్ కాలువ భూమిని ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని వినతిలో కోరారు. వినతిపై స్పందించిన మువ్వా విజయ్‌బాబు, సంబంధిత శాఖ అధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కమిటీ సభ్యుడు బండి యాలాద్రి తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
03 Aug 2026 20:34:41
జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్ లో టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్- 2843) వినతి.
జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నానబాల రామకృష్ణ,అర్వపల్లి నగేష్.
ఖమ్మం బ్యూరో , ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు...


Comments