కొత్త రాజోలి వద్దు.. పాత రాజోలిలోనే ఎమ్మార్వో భవనం నిర్మించాలి.
గ్రామస్తుల డిమాండ్.
జోగులాంబ గద్వాల, జూలై 21 (తెలంగాణ ముచ్చట్లు):
రాజోలి మండల కేంద్రంలో నూతన ఎమ్మార్వో కార్యాలయ భవనాన్ని కొత్త రాజోలిలో కాకుండా పాత రాజోలిలోనే నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం రాజకీయ పార్టీలకు అతీతంగా యువకులు, గ్రామ పెద్దలు తహసీల్దార్ రామ్మోహన్‌కు వినతిపత్రం అందజేశారు.తెలంగాణ ప్రభుత్వం రాజోలి మండల కేంద్రంలో నూతన ఎమ్మార్వో కార్యాలయ భవన నిర్మాణానికి రూ.2.25 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో వరదల కారణంగా ప్రభావితమైన మండల కేంద్రం రాజోలిలోనే నూతన భవనాన్ని నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
మండల పరిధిలోని 11 గ్రామాల ప్రజల అభిప్రాయాలను తీర్మానం రూపంలో సేకరించి త్వరలో జిల్లా కలెక్టర్‌కు, తహసీల్దార్‌కు సమర్పించనున్నట్లు తెలిపారు. మండల ప్రజలందరికీ సౌకర్యంగా ఉండేలా ఎమ్మార్వో కార్యాలయాన్ని పాత రాజోలిలోనే ఏర్పాటు చేయాలని, వివిధ పనుల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలకు అదే అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల పీఏసీఎస్ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, పచ్చర్ల మాజీ ఎంపీటీసీ పరమేష్ నాయుడు, వివిధ గ్రామాల ప్రజలు, రాజోలి గ్రామ యువకులు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Comments