చిన్నారెడ్డి నియామకం హర్షణీయం.

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.

చిన్నారెడ్డి నియామకం హర్షణీయం.

వనపర్తి,జులై19(తెలంగాణ ముచ్చట్లు): 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీకి తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. జి. చిన్నారెడ్డి గారిని చైర్మన్‌గా నియమించడం హర్షణీయమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులు, తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ వంటి కీలక రంగాలపై ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టేందుకు ఈ కమిటీ కీలకంగా పనిచేస్తుందన్నారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించడం, తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించడం, జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించడం ద్వారా ప్రజలకు, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సమర్థవంతమైన కార్యాచరణ అమలు అవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.డా. జి. చిన్నారెడ్డి  అనుభవం, పరిపాలనా దక్షత రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతాయని పేర్కొన్న ఎమ్మెల్యే, ఆయన నాయకత్వంలో కమిటీ సమర్థవంతంగా పనిచేసి రైతాంగానికి, ప్రజలకు అండగా నిలుస్తుందని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మామునూరు విమానాశ్రయ నిర్మాణంలో కాకతీయ వైభవం ప్రతిబింబించాలి. మామునూరు విమానాశ్రయ నిర్మాణంలో కాకతీయ వైభవం ప్రతిబింబించాలి.
హైదరాబాద్,జులై19(తెలంగాణ ముచ్చట్లు):  వరంగల్ చారిత్రక వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా, కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా మామునూరు విమానాశ్రయం రూపుదిద్దుకోవాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు.హైదరాబాద్‌లో...
కార్మికుల సంక్షేమానికి బీఆర్ఎస్ కట్టుబడి ఉంది.
చిన్నారెడ్డి నియామకం హర్షణీయం.
జిల్లా రైస్ మిల్లర్స్ ఉపాధ్యక్షుడు సయ్యద్ పాషాను సన్మానించిన పలుస శంకర్ గౌడ్.
కూచిపూడి నృత్యంలో ప్రతిభ చాటుతున్న కుమారి శృతి.
చిలుకటోనిపల్లి ఊకచెట్టు వాగులో మొసలి పట్టివేత.
వడ్డెరల అభ్యున్నతికి నూతన నాయకత్వం.