జిల్లా రైస్ మిల్లర్స్ ఉపాధ్యక్షుడు సయ్యద్ పాషాను సన్మానించిన పలుస శంకర్ గౌడ్.
వనపర్తి,జూలై19(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీరంగాపూర్ మండలానికి చెందిన సయ్యద్ పాషాను సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ ఘనంగా సన్మానించారు. వనపర్తి పట్టణంలోని కళ్యాణ సాయి ఫంక్షన్ హాలులో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ, రైస్ మిల్లర్స్ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యక్షుడిగా సయ్యద్ పాషా సమర్థవంతంగా కృషి చేసి, మిల్లర్ల సంక్షేమానికి పాటుపడాలని ఆకాంక్షించారు. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఆయన ఎన్నిక కావడం అభినందనీయమని పేర్కొన్నారు.కార్యక్రమంలో సాహితీ కళా వేదిక సభ్యులు బైరోజు చంద్రశేఖర్, దేశి రాములు, మాజీ కౌన్సిలర్లు జి.జె. శ్రీనివాసులు, గులాం ఖాదర్, లెక్చరర్ కురుమూర్తి, ఉపాధ్యాయులు కురుమూర్తి తదితరులు పాల్గొని సయ్యద్ పాషాకు శుభాకాంక్షలు తెలిపారు.


Comments