చిలుకటోనిపల్లి ఊకచెట్టు వాగులో మొసలి పట్టివేత.

చిలుకటోనిపల్లి ఊకచెట్టు వాగులో మొసలి పట్టివేత.

పెద్దమందడి,జులై19(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చిలుకటోనిపల్లి గ్రామ శివారులోని ఊకచెట్టు వాగులో మొసలి కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే స్నేక్ సొసైటీ సభ్యుడు కృష్ణసాగర్‌తో పాటు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న కృష్ణసాగర్, అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో మొసలిని సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం మొసలిని అటవీశాఖ ఆధీనంలోకి తీసుకుని సురక్షితమైన సహజ ఆవాసంలో విడిచిపెట్టేందుకు తరలించారు.మొసలి పట్టివేతతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.వాగులు, చెరువుల వద్దకు వెళ్లే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మామునూరు విమానాశ్రయ నిర్మాణంలో కాకతీయ వైభవం ప్రతిబింబించాలి. మామునూరు విమానాశ్రయ నిర్మాణంలో కాకతీయ వైభవం ప్రతిబింబించాలి.
హైదరాబాద్,జులై19(తెలంగాణ ముచ్చట్లు):  వరంగల్ చారిత్రక వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా, కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా మామునూరు విమానాశ్రయం రూపుదిద్దుకోవాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు.హైదరాబాద్‌లో...
కార్మికుల సంక్షేమానికి బీఆర్ఎస్ కట్టుబడి ఉంది.
చిన్నారెడ్డి నియామకం హర్షణీయం.
జిల్లా రైస్ మిల్లర్స్ ఉపాధ్యక్షుడు సయ్యద్ పాషాను సన్మానించిన పలుస శంకర్ గౌడ్.
కూచిపూడి నృత్యంలో ప్రతిభ చాటుతున్న కుమారి శృతి.
చిలుకటోనిపల్లి ఊకచెట్టు వాగులో మొసలి పట్టివేత.
వడ్డెరల అభ్యున్నతికి నూతన నాయకత్వం.