కూచిపూడి నృత్యంలో ప్రతిభ చాటుతున్న కుమారి శృతి.
వనపర్తి,జూలై19(తెలంగాణ ముచ్చట్లు):
సాంప్రదాయ కూచిపూడి నృత్యంలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్న కుమారి శృతిని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ అభినందించారు.ఆదివారం వనపర్తి పట్టణంలోని ఆమె స్వగృహంలో శాలువా, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. కళాకారులైన గుడిసె పార్వతి, గుడిసె శివలింగంల కుమార్తె శృతి చిన్ననాటి నుంచే కూచిపూడి నృత్యంలో విశేష ప్రతిభ కనబరుస్తూ పలు పురస్కారాలు అందుకోవడం అభినందనీయమన్నారు. ఇటీవల కళా ఉత్సవ్‌లో జిల్లా తరఫున జాతీయ స్థాయిలో పాల్గొని ప్రశంసలు పొందడంతో పాటు, భారత్ ఆర్ట్స్ అకాడమీ నిర్వహించిన కూచిపూడి కళా వైభవం–మహా బృంద నాట్యంలో పాల్గొని కళాకార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించడం విశేషమన్నారు. అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రముఖుల చేతుల మీదుగా సన్మానాలు అందుకోవడం ఆమె ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో బైరోజు చంద్రశేఖర్, ఎం.ఎ. సత్తార్, దేశి రాములు యాదవ్, గంధం నాగరాజు, నిరంజన్, శ్రీనివాస్ రెడ్డి, డా. శ్యాంసుందర్, బండారు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Comments