స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన టెన్త్ క్లాస్ బ్యాచ్ మిత్రులు.

స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన టెన్త్ క్లాస్ బ్యాచ్ మిత్రులు.

స్టేషన్ ఘనపూర్,జూన్24(తెలంగాణ ముచ్చట్లు):

తాటికొండ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మారపాక బుచ్చయ్య మరణం పట్ల ఆయన కుటుంబానికి టెన్త్ క్లాస్ 2004-05 బ్యాచ్ మిత్రులు అండగా నిలిచారు.మారపాక బుచ్చయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న సహచర విద్యార్థులు ఆయన కుమారుడు, తమ స్నేహితుడు మారపాక శ్రీనివాస్‌ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుటుంబానికి అండగా ఉంటామనే భరోసాతో రూ.7,300 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
కష్టకాలంలో స్నేహితుడికి తోడుగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, భవిష్యత్తులో కూడా కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మిత్రులు తెలిపారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ రాములు, క్లాస్‌మేట్స్ దశరథ్, రమేష్, ఎ. కుమార్, బి. కుమార్, శ్రీకాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .