ఓటు హక్కును నిర్లక్ష్యం చేయొద్దు.. ప్రతి అర్హుడు నమోదు చేసుకోవాలి.

ఓటు హక్కును నిర్లక్ష్యం చేయొద్దు.. ప్రతి అర్హుడు నమోదు చేసుకోవాలి.

జమ్మికుంట టౌన్ జులై 16 (తెలంగాణ ముచ్చట్లు):
 
ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ప్రతి ఓటు హక్కు కలిగిన వ్యక్తి సద్వినియోగం చేసుకోవాలని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం పిలుపునిచ్చారు.
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, పారదర్శకంగా, తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఇప్పటికే ఓటరు జాబితాలో పేర్లు ఉన్న వారు తమ వివరాలను మరోసారి పరిశీలించుకోవాలని సూచించారు.
బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరించే సమయంలో ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. అవసరమైన పత్రాలను సమర్పించి ఓటరు జాబితా ఖచ్చితత్వానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.
ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అని పేర్కొన్న స్వప్న సదానందం, ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటరికి కీలక బాధ్యత ఉందన్నారు. ప్రతి అర్హుడు ఓటరుగా నమోదు కావడంతో పాటు తన వివరాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసిన కలెక్టర్. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసిన కలెక్టర్.
పెద్దమందడి,జులై17(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో  తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) ఏర్పాటు ప్రతిపాదనలో భాగంగా జిల్లా...
వాన కోసం భక్తి జలధార.. రంగమ్మపెల్లిలో 200 మంది మహిళల నీరాభిషేకాలు.
ప్రజల భద్రతే లక్ష్యం.. విలాసాగర్‌లో ఏడు సీసీ కెమెరాల ఆవిష్కరణ.
మృతుడి కుటుంబానికి బీఆర్ఎస్ నేత కొట్టుకూరి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సహాయం.
విద్యార్థుల సంక్షేమంపై డిప్యూటీ డైరెక్టర్ ప్రత్యేక దృష్టి.
సత్తుపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం.
దమ్మపేటకు సబ్‌కోర్టు మంజూరు చేయాలి.