చిన్న కాలువలను రద్దు చేయాలని రైతుల వినతి.

చిన్న కాలువలను రద్దు చేయాలని రైతుల వినతి.

పెద్దమందడి,జూలై08(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం జంగమాయ పల్లి గ్రామంలో  చిన్న కాలువల నిర్మాణాన్ని రద్దు చేయాలని కోరుతూ గ్రామ రైతులు సూపరింటెండింగ్ ఇంజనీర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గ్రామంలో అధిక శాతం మంది చిన్న, సన్నకారు రైతులేనని, ప్రతి రైతుకు స్వల్ప విస్తీర్ణంలోనే సాగుభూమి ఉందని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో రైతుల భూముల మధ్యుగా చిన్న కాలువలను ఏర్పాటు చేస్తే ఇప్పటికే తక్కువగా ఉన్న భూమి మరింత తగ్గిపోతుందని, దీంతో రైతుల జీవనోపాధి దెబ్బతినడంతో పాటు ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.అలాగే బసిరెడ్డి చెరువుకు నీరు చేరినప్పుడు ఇప్పటికే ఉన్న తూములు, కాలువల ద్వారానే ప్రతి ఎకరానికి సాగునీరు అందుతోందని, కొత్తగా ప్రతిపాదించిన చిన్న కాలువల వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో గ్రామ రైతులందరూ సమావేశమై ఏకగ్రీవంగా చిన్న కాలువల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినట్లు తెలిపారు. రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదిత చిన్న కాలువల నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని సూపరింటెండింగ్ ఇంజనీర్‌ను వినతిపత్రం ద్వారా కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .