హెలెన్ కెల్లర్ ఆశయాలు స్ఫూర్తిదాయకం.

హెలెన్ కెల్లర్ ఆశయాలు స్ఫూర్తిదాయకం.

- దమ్మపేటలో జయంతి వేడుకలు.
- చిత్రపటానికి నివాళి.

దమ్మపేట, జూన్ 27 (తెలంగాణ ముచ్చట్లు): 

దమ్మపేట మండల సమాఖ్య ఆధ్వర్యంలో మదర్ థెరీసా దివ్యాంగుల పునరావాస సేవల కేంద్రంలో హెలెన్ కెల్లర్ జయంతి వేడుకలను శనివారం నిర్వహించారు. మండల సమాఖ్య ప్రతినిధులు, గ్రామ సంఘాల సభ్యులు, వివిధ గ్రామాల దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెలెన్ కెల్లర్ జీవిత విశేషాలను, దివ్యాంగుల హక్కులు, సంక్షేమం కోసం ఆమె చేసిన కృషిని వక్తలు వివరించారు. ఎన్నో ప్రతికూల పరిస్థితులను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా దివ్యాంగులకు స్ఫూర్తిగా నిలిచిన హెలెన్ కెల్లర్ సేవలను కొనియాడారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మాట, వినికిడి లోపంతో పాటు దృష్టిలోపం ఉన్న చిన్నారులు, వారి తల్లిదండ్రులు ప్రత్యేకంగా పాల్గొన్నారు. దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, వారి ప్రతిభను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల సమాఖ్య సభ్యులు, గ్రామ సంఘాల ప్రతినిధులు, దివ్యాంగుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .