అర్హులందరికీ ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అందించాలి.

దయ్యాల దాసు.

అర్హులందరికీ ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అందించాలి.

వనపర్తి,జూలై04( తెలంగాణ ముచ్చట్లు):

హైదరాబాద్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) చరణ్ దాసు ను జూబ్లీహిల్స్ డివిజన్ ఎస్సీ విభాగం మాజీ అధ్యక్షులు, ఐ ఎన్ టి యు సి తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి దయ్యాల దాసు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.ఈ సందర్భంగా దయ్యాల దాసు మాట్లాడుతూ..ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణాలు మంజూరు చేసి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈడీని కోరారు.దీనిపై స్పందించిన ఈడీ చరణ్ దాసు మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసే ప్రక్రియ కొనసాగుతోందని, ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులందరికీ ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అడ్డాకుల బెంజిమెన్, గద్దల ప్రభాకర్, కండెరా రాంకుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .