ఉచిత పోలీస్ శిక్షణకు ప్రవేశ పరీక్షలు విజయవంతం.

ఉచిత పోలీస్ శిక్షణకు ప్రవేశ పరీక్షలు విజయవంతం.

వనపర్తి,జూన్28(తెలంగాణ ముచ్చట్లు):

నిరుద్యోగ యువతకు ఉచిత పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ నియామక శిక్షణ అందించేందుకు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్, శ్రీధర్స్ కాలేజ్ ఫర్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రవేశ పరీక్షలు ఆదివారం విజయవంతంగా జరిగాయి. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పి. మధుకర్ స్వామి, డీసీపీ సారథ్యంలో పరీక్షలను నిర్వహించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 47 పరీక్షా కేంద్రాల్లో, ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాలుగు కేంద్రాల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి సుమారు 242 మంది అభ్యర్థులు హాజరయ్యారు.ప్రవేశ పరీక్షలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి వారికి నాలుగు నెలల పాటు పూర్తిగా ఉచితంగా పోలీస్ నియామక శిక్షణ అందించనున్నట్లు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ గద్దె భాస్కర్ తెలిపారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర కోఆర్డినేటర్ గద్దె భాస్కర్, సాహితి కళావేదిక అధ్యక్షుడు శంకర్ గౌడ్, సత్తార్, శివలింగం, రమేష్, ఉప్పరి తిరుమలేష్, కండ్రెని వెంకటేష్, బి. రాము తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా గద్దె భాస్కర్ మాట్లాడుతూ, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో శ్రీధర్స్ కాలేIMG-20260628-WA0005జ్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రతినిధులు, విద్యావేత్తలు, స్వచ్ఛంద కార్యకర్తలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .