మహతి వేదికపై అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన.

మహతి వేదికపై అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన.

వనపర్తి,జూన్27(తెలంగాణ ముచ్చట్లు):

తిరుపతిలోని శ్రీ మహతి ఆడిటోరియంలో స్వామివారి దివ్య సన్నిధిలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో సాత్విక కూచిపూడి అకాడమీ' విద్యార్థులు తమ అద్భుత కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు.అకాడమీ అధినేత, ప్రముఖ నృత్య గురువు సుధారాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలు నయనానందకరంగా సాగాయి.ఈ సందర్భంగా వనపర్తి జిల్లా  ఆత్మకూరు ప్రాంతానికి చెందిన అకాడమీ విద్యార్థులు స్పందన, అన్విక, ప్రణస్వి, ఆరాధ్య, శ్రీనిధి, వారుణి, భావిత, విద్యా హరిణి, జ్యోష్ణ తదితరులు కూచిపూడి నృత్యంలోని లాస్యభావాలు, హావభావాలు, సంప్రదాయ నృత్య భంగిమలను అద్భుతంగా ఆవిష్కరించి భక్తులను, కళాభిమానులను ముగ్ధులను చేశారు.విద్యార్థుల ప్రతిభను అభినందించిన ఆలయ అధికారులు, భక్తులు వారికి శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.భారతీయ సాంప్రదాయ కళలను భావితరాలకు చేరవేయడంలో ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .