చింత వరుణ్ తేజ్ మృతి ఆ కుటుంబానికి తీరని లోటు.

సింగపురం ఇందిరా,కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జ్ .

చింత వరుణ్ తేజ్ మృతి ఆ కుటుంబానికి తీరని లోటు.

స్టేషన్ ఘనపూర్,జూన్24(తెలంగాణ ముచ్చట్లు):

స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీకి చెందిన చింత వరుణ్ తేజ్ ఇటీవల ప్రమాదవశాత్తు ఈతకు వెళ్లి మృతి చెందిన ఘటన పట్ల స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి సింగపురం ఇందిరా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
వరుణ్ తేజ్ కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించిన ఆమె, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేసి కుటుంబానికి అండగా నిలిచారు.

యువకుడి అకాల మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న తల్లిదండ్రులను ఓదార్చిన సింగపురం ఇందిరా, ఈ నష్టం ఆ కుటుంబానికి తీరనిదని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు సింగపురం నాగయ్య, సీనియర్ నాయకులు సింగపురం వెంకటయ్య, చింత ఎల్లయ్య, చింత జోగి, సింగపురం సందీప్, రాజ్‌కుమార్, రాజవరపు ప్రసాద్, చింత రాజు, చింత శ్యామ్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .