పొలంలో మంటలు వ్యాపించి వ్యవసాయ గుడిసె దగ్ధం.

పొలంలో మంటలు వ్యాపించి వ్యవసాయ గుడిసె దగ్ధం.

ధర్మసాగర్, జూన్ 13(తెలంగాణ ముచ్చట్లు): 

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం సోమదేవరపల్లి గ్రామంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలంలో ఉన్న కోయకాలకు నిప్పు పెట్టగా మంటలు అదుపుతప్పి వేగంగా వ్యాపించాయి. దీంతో సమీపంలో ఉన్న నమిండ్ల వీరస్వామికి చెందిన వ్యవసాయ గుడిసెకు మంటలు అంటుకున్నాయి.

స్థానికుల సమాచారం మేరకు గ్రామస్తులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే గుడిసె పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో గుడిసెలో ఉన్న వ్యవసాయ పనిముట్లు, పరికరాలు మరియు ఇతర సామగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.

ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధిత రైతు వీరస్వామి తెలిపారు. ఘటనపై సంబంధిత అధికారులకు సమాచారం అందించగా, వారు స్పందించి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేశారు.

గ్రామంలో జరిగిన ఈ ఘటన రైతుల్లో ఆందోళన కలిగించింది. కోయకాలు తగలబెట్టే సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని స్థానికులు సూచిస్తున్నారు.IMG-20260613-WA0205

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .