ఉద్యమ నాయకుడికి ఘన స్వాగతం.. జన్మదిన వేడుకలు నిర్వహించిన చైర్మన్ దిలీప్.

ఉద్యమ నాయకుడికి ఘన స్వాగతం.. జన్మదిన వేడుకలు నిర్వహించిన చైర్మన్ దిలీప్.

జమ్మికుంట టౌన్ జూన్ 12 (తెలంగాణ ముచ్చట్లు):

మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం రెండు రోజుల క్రితమే ముగిసినప్పటికీ, ఆయనపై అభిమానాన్ని చాటుకుంటూ జమ్మికుంటలో శుక్రవారం ప్రత్యేకంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. పట్టణానికి విచ్చేసిన హరీష్ రావుకు మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ప్రశాంత్ కుమార్ (దిలీప్), తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో హరీష్ రావు పోషించిన పాత్రను గుర్తు చేసుకున్నారు. ఉద్యమ కాలం నుంచి ప్రజల మధ్య ఉంటూ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా ఆయనను అభివర్ణించారు. యువ నాయకులకు మార్గనిర్దేశం చేస్తూ, రాజకీయంగా ఎదగడానికి అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తున్న హరీష్ రావు సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

ప్రజాసేవ పట్ల అంకితభావంతో ముందుకు సాగుతున్న హరీష్ రావు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.IMG-20260612-WA0053

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .