జమ్మికుంట రెవెన్యూ కార్యాలయంలో అక్రమాల ఆరోపణలు.. ఆర్ఐపై విచారణకు డిమాండ్.

జమ్మికుంట రెవెన్యూ కార్యాలయంలో అక్రమాల ఆరోపణలు.. ఆర్ఐపై విచారణకు డిమాండ్.

🔸 ధ్రువపత్రాలు, భూ వ్యవహారాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ ప్రజల ఆరోపణలు.

జమ్మికుంట టౌన్ జూన్ 10 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందని పలువురు చర్చించుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో గత రెండు సంవత్సరాలుగా ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న సదరు ఉద్యోగి గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న భూములను ఎలాంటి ఎంక్వయిరీ లేకుండా తాసిల్దార్ కు రిపోర్టు అందజేసి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లు పట్టణంలో జోరుగా చర్చ జరుగుతుంది. రేషన్ కార్డుల జారీలో కూడా భారీ మొత్తంలో నగదు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థులు తీసుకునే కులం సర్టిఫికెట్, ఆదాయ సర్టిఫికెట్, స్థానిక నివాసం సర్టిఫికెట్ జారీకి కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు పలువురు ప్రజలు విద్యార్థులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. రెండు సంవత్సరాలుగా తాసిల్దార్ కార్యాలయంలో అనేక  అవినీతికి ఆరోపణలు ఎదుర్కొంటున్న కానీ సదరు ఉద్యోగిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.. కార్యాలయం సమయంలో ఆఫీస్కు రాకుండా 11:30,12:00 గంటల సమయంలో ఆఫీసుకు వచ్చి విధులు నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. స్థానిక మున్సిపల్ ఎలక్షన్ లో కూడా ఓసి కి బీసీ సర్టిఫికెట్ మంజూరు చేశారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కి కూడా డబ్బులు తీసుకొని ఇద్దరు భార్యలు ఉంటే తప్పుడు రిపోర్ట్ అందజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి అధికారిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ప్రజలకు విద్యార్థులకు ఇబ్బందులు కలగ చేస్తున్న ఆర్ఐపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .