జమ్మికుంటలో బీఎస్పీ శక్తి ప్రదర్శనకు సన్నాహాలు.

జూన్ 7న సామాజిక పరివర్తన సదస్సు.

జమ్మికుంటలో బీఎస్పీ శక్తి ప్రదర్శనకు సన్నాహాలు.

జమ్మికుంట టౌన్ జూన్ 05 (తెలంగాణ ముచ్చట్లు):

హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జూన్ 7వ తేదీ ఆదివారం నిర్వహించనున్న సామాజిక పరివర్తన సదస్సుకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రామ్ శేఖర్ ముఖ్య అతిథిగా, బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్ విశిష్ట అతిథిగా హాజరుకానున్నట్లు హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు మంద సమ్మయ్య తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్‌లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు క్యాడర్ క్యాంపు నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి హాజరయ్యే వారికి ఉదయం టీ, టిఫిన్‌తో పాటు మధ్యాహ్నం భోజన వసతి కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

హుజురాబాద్, కమలాపూర్, వీణవంక, ఇల్లంతకుంట, జమ్మికుంట మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు, యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ ఇన్‌చార్జి దొడ్డె సమ్మయ్య, సీనియర్ నాయకులు మారపల్లి మొగిలయ్య, అసెంబ్లీ ఇన్‌చార్జి వేల్పుల మల్లేష్, నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు), సీనియర్ నాయకుడు ఇదునూరి రమేష్, అసెంబ్లీ ఉపాధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, అసెంబ్లీ కార్యదర్శి గరిగె చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .