దేశ సేవకు అడుగులు.. 

ఇండియన్ ఆర్మీకి ఎంపికైన గాజు వంశీ .

దేశ సేవకు అడుగులు.. 

భీమదేవరపల్లి, జూన్ 3 (తెలంగాణ ముచ్చట్లు):

భీమదేవరపల్లి మండలంలోని గట్లనర్సింగాపూర్ గ్రామానికి చెందిన గాజు వంశీ ఇండియన్ ఆర్మీలో ఉద్యోగానికి ఎంపిక కావడంతో గ్రామ యువత ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా యువకులు వంశీకి శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. గ్రామానికి చెందిన యువకుడు దేశ సేవకు ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొంటూ, వంశీ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి గ్రామానికి, మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు కాసనగొట్టు సాయిరాం, వెన్నంపల్లి నాగరాజు, గాజు ముత్యాల అరవింద్, ముత్యాల శ్రావణ్, ఒడ్డెపల్లి శ్రీనివాస్, బరిగె నరేష్, కుమార్, అయిలయ్య, పొన్న శ్రీను, బండారి కార్తీక్, గాజు చింటూ తదితరులు పాల్గొన్నారు.
గ్రామ యువత సాధించిన ఈ విజయం ఇతర యువకులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .