రైల్వే భారత్  స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎ స్టీ సీ గా ఎర్ర ఏలియా.

రైల్వే భారత్  స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎ స్టీ సీ గా ఎర్ర ఏలియా.
నియామక పత్రాన్ని అందుకుంటున్న ఎర్ర ఏలియా

 కాజీపేట్ జూన్ 4 (తెలంగాణ ముచ్చట్లు)

 దక్షిణ మధ్య రైల్వే భారత్ స్కౌట్ సైడ్ గైడ్స్ స్టేట్ ట్రైనింగ్ కమిషనర్ గా ఎర్ర ఏలియా బాధ్యతలు స్వీకరించారు. సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో సౌత్ సెంట్రల్ స్టేట్ సెక్రటరీ శేఖర్ బాబు చేతుల మీదుగా దక్షిణ మధ్య రైల్వే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్ స్టేట్ ట్రైనింగ్ కమిషనర్ గా నియామక పత్రాన్ని ఎర్ర ఏలియా అందుకున్నారు. ఈ సందర్భంగా ఏలియా మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్  ట్రైనింగ్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో అధికారులు నా సేవలను గుర్తించి నాకు ఇచ్చినటువంటి పదవీ బాధ్యతలను ఎంతో సమర్ధతతో నిర్వహిస్తానన్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్లతో పాటు సౌత్ రైల్వే లకు స్టేట్ కమిషనర్ గా నన్ను నియమించడం ఎంతో సంతోషంగా ఉన్నది అన్నారు. నాపై నమ్మకంతో ఇంత పెద్ద పదవి బాధ్యతలు నాకు అప్పగించినందుకు గాను ఈ పదవి రావడానికి సహాయ సహకారాలు అందించినటువంటి అధికారులకు పెద్దలకు నా తోటి ఉద్యోగులకు భారత్ సైన్ గైడ్స్ సంస్థలో ఉన్నటువంటి నా సహచర మిత్ర బృందానికి ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .