జమ్మికుంటలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. అమరవీరులకు నివాళులు.

జమ్మికుంటలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. అమరవీరులకు నివాళులు.

జమ్మికుంట టౌన్ జూన్ 02 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి, మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

గాంధీ చౌరస్తాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ నివాళులర్పించారు. ప్రజాకవి గద్దర్ చిత్రపటానికి కూడా పూలమాల వేసి గౌరవం తెలిపారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో మంది విద్యార్థులు, యువకులు, ఉద్యమకారులు చేసిన త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. తాను కూడా విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని, నేడు ప్రజల ఆశీర్వాదంతో మున్సిపల్ చైర్మన్‌గా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం గర్వకారణంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

తెలంగాణ కోసం అమరులైన వీరులను స్మరించుకుంటూ "వీరులారా వందనం" గేయాన్ని ఆలపించి వారికి ఘన నివాళులర్పించారు. అలాగే జమ్మికుంట పట్టణ ప్రజలకు, తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, మేనేజర్ జి. రాజిరెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, తెలంగాణ ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .