వేలేరు పోలీస్ స్టేషన్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
Views: 6
On
వేలేరు, జూన్ 2 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేలేరు ఎస్సై సురేష్ జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాలను స్మరించుకుంటూ వారి సేవలను కొనియాడారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments