తెలంగాణ రాష్ట్ర సాధనలో పోరాడిన ఉద్యమకారులకు ఘన సన్మానం.

తెలంగాణ రాష్ట్ర సాధనలో పోరాడిన ఉద్యమకారులకు ఘన సన్మానం.

పెద్దమందడి,జూన్03(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.గ్రామ పార్టీ అధ్యక్షుడు మలక్ సురేష్ పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని విశేష సేవలందించిన ఉద్యమకారులు కాజా హుస్సేన్, సతీష్ శర్మ, మలక్ సురేష్, చిత్తూర్ కృష్ణారెడ్డిలను గ్రామ సర్పంచ్ అశోక్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. తెలంగాణ ఉద్యమంలో వారు చేసిన సేవలను కొనియాడుతూ వారి పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి మాట్లాడుతూ.. దశాబ్దాల పోరాటాలు, వేలాది మంది ఉద్యమకారుల త్యాగాలు, అమరుల బలిదానాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని అన్నారు. రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల సేవలను గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాకుండా ప్రజల ఆత్మగౌరవం, స్వాభిమానం మరియు ఆకాంక్షల సాధనకు ప్రతీకగా నిలిచే చారిత్రక సందర్భంగా అభివర్ణించారు.అనంతరం ఉద్యమకారులకు శాలువాలు కప్పి సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .